Oct 27,2021 22:08

ఫొటో : మాట్లాడుతున్న వైసిపి నాయకులు

ఫొటో : మాట్లాడుతున్న వైసిపి నాయకులు
భూములను కాపాడుకోవాలి
ప్రజాశక్తి-చేజర్ల : మండలంలోని కాకివాయి గ్రామంలో వంక ఫోరం బోకు భూమిని పట్టాగా మార్చుకుని వైసిపి నాయకులు, అమాయకులైన దళితులు సాగు చేసుకుంటున్న భూమి లో రాత్రి సమయం లో ఫినిషింగ్‌ వేస్తున్నారని, వాటిని కాపాడాలని వైకాపా నాయకులు నాగా నాగిరెడ్డి అధికారులను కోరారు. ఎన్నో ఏళ్లుగా గ్రామ దళితులు సాగు చేసుకుంటున్న వారికి ఇవ్వని పట్టాలు అదే గ్రామానికి చెందిన రైతులకు నేరుగా వాగు ఫోరం బోకు భూమి ని వారికి పట్టాలు ఏవిధంగా ఇస్తారని బుధవారం ఆయన అన్యాక్రాంతమైన వంక పోరంబోకు భూమి దగ్గర మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై ఆత్మకూర్‌ ఆర్‌డిఒ దష్టికి తీసుకెళ్లిన ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.
అదే భూమిని పేద ప్రజలకు పంపిణీ చేస్తే సాగు చేసుకుని జీవనాధారం పొందుతారని తెలిపారు. సర్వేయర్‌ శేషయ్య ను వివరణ కోరగా పూర్వ పర్యాయాలు పరిశీలించి పై అధికారుల దష్టికి తీసుకెళ్తానని చెప్పారు.