Oct 28,2021 20:39

అధికారులతో మాట్లాడుతున్న జెసి

అధికారులతో మాట్లాడుతున్న జెసి
భూముల పరిశీలన
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాళెం:మండలంలో జాయింట్‌ కలెక్టర్‌ హరేందిర ప్రసాద్‌ గురువారం పర్యటించారు. మండలంలోని జొన్నవాడ-పెనుబల్లి తిప్ప వద్ద వవ్వేరు కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ గోదాము నిర్మాణం కోసం కేటాయించిన భూమిని తొలుత ఆయన పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నగర పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం లో ఓ వ్యక్తికి చెందిన చుక్కల భూమిని,రామచంద్రారెడ్డి నగర్‌ లో పలు భూములను
పరిశీలించారు.అంతేకాకుండా పట్టణంలోని రెండో సచివాలయం తో పాటు దామరమడుగు గ్రామంలోని సచివాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తోపాటు ఇళ్ల పట్టాలు, పెన్షన్ల పంపిణీ, ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ సం
క్షేమ పథకాలు అందేలా పని చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలపై దష్టి సారించి అమలు చేయాలని సూచించారు. అయన వెంట తహశీల్దార్‌్‌ హమీద్‌, నగర పంచాయతీ కమిషనర్‌ శ్రీనివాసరావు, ఆర్‌ ఐ. సునీల్‌, విఆర్వోలు ఇతర సిబ్బంది ఉన్నారు.