
తాళ్లరేవు (తూర్పు గోదావరి) : ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా.. భోగి మంటల్లో వ్యవసాయ చట్టాల ప్రతులను వేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నిరసన తెలిపింది. ఆల్ ఇండియా కిసాన్ సంఘం కో ఆర్డినేషన్ కమిటీ పిలుపుమేరకు ఎపి కౌలు రైతులు తాళ్లరేవు మండలం లో రెడ్డివారిపేట పత్తిగొంది పటవల సీతారామపురం గ్రామాలలో ఈ నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వల్లి రాజబాబు, పంపను నాగేశ్వరరావు రెడ్డి, శ్రీనివాసు, దొంగే శ్రీనివాసు, కే.సత్తిరాజు, పంపన సూర్యనారాయణ, ఇళ్ల మహేశ్వరరావు, నల్ల సూర్య ప్రకాష్, రైతులు పాల్గొన్నారు.