Jan 15,2022 01:16

జిఒ కాపీలను దహనం చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ద

ప్రజాశక్తి -కలెక్టరేట్‌:రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జిఒలను శుక్రవారం టిడిపి కార్యాలయం వద్ద భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టిడిపి విశాఖ పార్లమెంట్‌ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన చెత్త పన్ను, పేదల ఇళ్లకు సంబంధించిన ఓటిఎస్‌ జివో కాఫీలను భోగి మంటలో వేసి దగ్ధం చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, నాయకులు నక్కా కనకరాజు, అక్కిరెడ్డి జగదీష్‌, బుచ్ఛా రామిరెడ్డి, రమణ పాల్గొన్నారు.
నర్సీపట్నం టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను హింసించే విధంగా ఆస్తి పన్ను, యూజర్‌ ఛార్జీలు, పేదల వద్ద ఓటిఎస్‌, చెత్త పన్నులను నిరసిస్తూ వాటి జిఒ కాఫీలను మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. చెత్తపై కూడా పన్ను వేయడం అన్యాయమన్నారు.
వడ్డాది : టిడిపి చోడవరం నియోజకవర్గ ఇన్చార్జి తాతయ్యబాబు ఆధ్వర్యాన బంగారుమెట్ట జంక్షన్లో శుక్రవారం భోగి మంటలు వేసి జీవో కాపీలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ డొంకిన అప్పలనాయుడు, టిడిపి నాయకులు గోకివాడ కోటేశ్వరరావు, తమరాన దాసు, ఎల్లపు జగ్గారావు, సాయం శేషు, దొండా నరేష్‌, రమేష్‌ పాల్గొన్నారు
మాడుగుల : మండలంలో టిడిపి నేతలు భోగి మంటల్లో ఓటీఎస్‌ జీఓ కాపీలు దగ్ధం చేశారు. కెజె.పురంలో ఎంపిటిసి భీశెట్టి శ్రీనివాసరావు, పొంగలిపాకలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఉండూరు దేముడు ఆధ్వర్యాన ఈ కార్యక్రమాలు జరిగాయి. ఎంపిటిసి చిన్నతల్లి, టిడిపి నేతలు రాపెటి జోగినాయుడు, సరగడం ఆదిబాబు, పాలకుర్తి శ్రీనివాసరావు, దాడి లక్ష్మణ, ఎల్లపు రాము, సంతోష్‌ కాళ్ళ చెల్లయ్య పాల్గొన్నారు.
అనకాపల్లి::వైసీపీ ప్రభుత్వం హయాంలో పేదలపై ఆర్థిక భారాన్ని మోపే జీవోల కాపీలను మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం భోగి మంటల్లో తగల బెటారు. స్థానిక పరమేశ్వరి పార్కు జంక్షన్లో భోగి మంటల్లో జీవోల కాఫీలను తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మళ్ల సురేంద్ర, కుప్పిలి జగన్మోహనరావు, బొడ్డేడ జోగినాయుడు, పొలిమేర నాయుడు, దొడ్డి జగదీశ్వరరావు పాల్గొన్నారు.
చీడికాడ : మండలలోని అర్జనగిరి గ్రామంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు జాజి మొగ్గల ప్రసాద్‌ ఆధ్వర్యాన ప్రజావ్యతిరేక జీవోలను భోగి మంటలో వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాడుగుల నియోజకవర్గం ఇంచార్జ్‌ పివిజి కుమార్‌, నాయకులు రెడ్డి సన్యాసినాయుడు, పేరపు కొండబాబు, కసిరెడ్డి గణపతి, ఎంపిటిసిలు అమ్మతల్లి నాయుడు, దారపు పెద్దినాయుడు పాల్గొన్నారు.
దేవరాపల్లి : టిడిపి మండల అధ్యక్షులు చిటిమిరెడ్డి సూర్యనారాయణ ఆధ్వర్యంలో మండలంలోని చింతలపూడి పంచాయతీలో జిఒలను వేసి దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ముక్కు ఈశ్వరరావు, దాయిరి దేముడు, దాయిరి లక్ష్మణ, ముసలి తమ్మయ్య, మాదలి సన్యాసిరావు, బంగారయ్య పాల్గొన్నారు.
కె.కోటపాడు : టిడిపి మండల అధ్యక్షులు రొంగలి మహేష్‌ ఆధ్వర్యాన పైడంపేట గ్రామంలో భోగి మంటలో ప్రభుత్వ జీవో కాపీలను దగ్ధం చేశారు. ఓటిఎస్‌ జీవోతో పాటు మరో నాలుగు జీవోలను కాల్పినట్లు ఆయన తెలిపారు.
కశింకోట:వైసిపి పాలనను ప్రజలు భోగి మంటల్లో వేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మాజీ శాసన సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జి పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. మండలంలోని తీడ గ్రామంలో ఆయన భోగి మంటల్లో వేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కాయల మురళి, పార్టీ నాయకులు సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, వేగి గోపి కృష్ణ పాల్గొన్నారు.
రాంబిల్లి : మండలంలో పంచదార్ల పంచాయతీ పంచదార్ల గ్రామంలో టిిడిపి మండల పార్టీ అధ్యక్షులు వసంతవాడ వెంకటేశ్వరరావు(దినుబాబు), వెంకటేశ్వరరావు దహనం చేశారు.
డుంబ్రిగుడ:పెంచిన నిత్యావసర సరకుల ధరలను నిరసిస్తూ మండల కేంద్రంలో భోగి మంటల వద్ద టిడిపి నాయకులు నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు టి సుబ్బారావు, టిఎన్టియుసి అరకు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి ఎం.స్వామి, కె.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
మునగపాక రూరల్‌: మండలంలోని నాగుల పల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన చేపట్టారు.
భీమునిపట్నం:ప్రజా వ్యతిరేక జిఓలను టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు స్థానిక పార్టీ కార్యాలయం వద్ద భోగి మంటల్లో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, తెలుగు రైతు విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి డిఎఎన్‌ రాజు, నాయకులు వై.అనిల్‌ ప్రసాద్‌, జి.పరశురామ్‌, ఎంపీటీసీ కోరాడ రమణ, పతివాడ రాంబాబు, అల్లు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.