Mar 05,2021 19:03

postarlu aviskaristunna mla dulam nageswararao

భోగేశ్వర స్వామి ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణ
కైకలూరు : పాతాళ భోగేశ్వరస్వామి వారి మహోత్సవాల వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శుక్రవారం ఆవిష్కరించారు. ఎమ్మెల్యేను ఆయన నివాసం వద్ద కలిదిండి శ్రీ పాతాళ భోగేశ్వరస్వామి ఆలయ ఇఒ సింగనపల్లి శ్రీనివాసరావు కలిశారు. శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారి మహోత్సవాలు ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకూ జరుగుతాయని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఐనాల బ్రహ్మజీ, సాగిరాజు వాసురాజు, బత్తిన శ్రీకాంత్‌, మోహనరావు, పాల్గొన్నారు.