Feb 23,2021 19:21

భీష్మ ఏకాదశి సందర్భంగా నటుడు నందమూరి బాలకృష్ణ ఎన్‌టీఆర్‌ కధానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ''భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. అందుకనే ఎన్‌టీఆర్‌ కధానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. నిడివి ఎక్కువ అవడం వల్ల ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. మంగళవారం నాడు భీష్మ ఏకాదశి పండుగ సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నాను'' అన్నారు.