Nov 27,2020 21:17

న్యూఢిల్లీ: భగత్‌ సింగ్‌, అమర వీరుల పోరాట స్పూర్తితో తాము హక్కుల కోసం పోరాడుతున్నామని కిసాన్‌ సభ హర్యానా రాష్ట్ర కార్యదర్శి సుమిత్‌ సింగ్‌ చెప్పారు. గురువారం ఢిల్లీ, హర్యానా సరిహద్దులో రైతులనుద్దేశించి మాట్లాడుతూ, కులం, మతం ప్రాతిపదికన ప్రజల్లో చీలిక తెచ్చి, ఒకరినొకరు కొట్లాడుకునేలా చేయడం ఆరెస్సెస్‌ ఎజెండా, దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లోను తాము అనుమతించబోమని అన్నారు. 'మేం రైతులం. పొలాల్లో మేమంతా కలసికట్టుగా పనిచేస్తాం. ఈ విచ్ఛిన్నకర ఎజెండాకు వ్యతిరేకంగా పోరాడడంలోనూ అదే ఐక్యతతో ముందుకుసాగుతాం' అని సుమిత్‌ సింగ్‌ చెప్పారు.
'హర్యానా ఉప ముఖ్య మంత్రిని కలవడానికి రైతులు వెళ్లినప్పుడు ఆయనకు కరోనా అని చెప్పారు. కరోనా మీకే కాదు, మొత్తం మీ ప్రభుత్వానికే వచ్చింది. దానిని వదిలించే మందు మా రైతుల వద్ద ఉంది.' అని ఆయన పేర్కొన్నారు.
' రైతులను ఢిల్లీలోకి అనుమతించబోమని మీరన్నారు. మేము మీ అధికార బలానికి భయపడం. ఈ పోరాటాన్ని తుదకంటా తీసుకెళ్తాం. నెలలకు సరిపడా రేషన్‌ను కేటాయించాము. మా పోరాటం మాకు గొప్ప బలాన్నిచ్చింది. మేము పోరాడతాం, మేము గెలుస్తాం, విప్లవం గెలవనివ్వండి.' అని సుమిత్‌ అన్నారు.