Jan 15,2022 11:57

కరీంనగర్‌ : భార్య ఒక చోట, భర్త మరో చోట.. ఇదేమి న్యాయం అంటూ ఉపాధ్యాయులు ముగ్గుతో నిరసన వ్యక్తపరిచారు. శనివారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట టీచర్లు వినూత్న నిరసన తెలిపారు. అందమైన రంగవల్లుల ముగ్గులు వేసి 317 జిఒ పై అసహనాన్ని వ్యక్తపరిచారు. స్పవుజ్‌ విషయంలో 13 జిల్లాలను అన్‌ బ్లాక్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. భార్య ఒక చోట, భర్త మరో చోట.. ఇదేమి న్యాయం అంటూ ఉపాధ్యాయులు ముగ్గుతో స్లోగన్‌ వినిపించారు.