Nov 27,2020 09:33

సిడ్ని : భారత్‌, - ఆస్ట్రేలియా క్రికెట్‌ సమరం మొదలైంది. సిడ్ని వేదికగా జరుగుతున్న మూడు వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే శుక్రవారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ బ్యాటింగ్‌ను ఎంచుకున్నారు. కరోనా తర్వాత ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడుతున్న తొలి మ్యాచ్‌ ఇదే. 9 నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతుండటం విశేషం. మార్చి 2న న్యూజిలాండ్‌తో చివరి టెస్ట్‌ ఆడిన కోహ్లీ టీమ్‌ ...కరోనా కారణంగా ఏ జట్టుతో ఆడలేదు. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ కూడా కరోనా కారణంగా రద్దు అయింది. లాక్‌డౌన్‌ తర్వాత యుఎఈ, ఐపిఎల్‌ ఆడిన భారత ఆటగాళ్లు అక్కడి నుండి నేరుగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ఆడేందుకు ఆ దేశానికి చేరుకున్నారు. 14 రోజలు క్వారెంటైన్‌ ఉండి ఇప్పుడు ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమయ్యారు.
భారత జట్టు : విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కెఎల్‌ రాహుల్‌, హార్థిక్‌ పాండ్య, మయాంక్‌ అగర్వాల్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌షమి, జస్ప్రీత్‌ బుమ్రా, యుజువేంద్ర చాహల్‌, నవదీప్‌ షైనీ.
ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), స్టీవ్‌ స్మీత్‌, డేవిడ్‌ వార్నర్‌, గ్లెన్‌ మాక్స్‌ వెల్‌, మార్నన్‌ లబుషేన్‌, మార్కన్‌ స్టాయినిస్‌, అలెక్స్‌క్యారీ, పాట్‌ కమిన్స్‌, జోష్‌ హాజిల్‌ వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, అడంజంపా