
హైదరాబాద్ : కరోనా నివారణ కోసం రష్యా అభివృద్థి చేసిన స్పుత్నిక్ వి టీకాను భారత్లో హెటిరో సంస్థ తయారు చేయనుంది. స్పుత్నిక్ వీ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. రష్యా ప్రభుత్వంతో కలిసి ఏడాదికి సుమారు 10 కోట్ల డోసులు తయారు చేసేందుకు ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. హెటిరో సంస్థతో పాటు రష్యన్ డైరెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) లు ప్రపంచవ్యాప్తంగా టీకాను పంపిణీ చేయనున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో భారత్లో స్పుత్నిక్ వి టీకా ఉత్పత్తిని ప్రారంభించనున్నాయి.