Oct 14,2021 20:38

ఆఖరి లీగ్‌లో పురుషుల, మహిళల జట్లు పరాజయం
థామస్‌, ఉబర్‌కప్‌ ఫైనల్స్‌

ఆహస్‌(డెన్మార్క్‌): థామస్‌, ఉబర్‌కప్‌ ఫైనల్స్‌ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు పరాజయం పాలయ్యాయి. థామస్‌కప్‌ గ్రూప్‌-సిలో భారత పురుషుల జట్టు 1-4తో చైనా చేతిలో, ఉబర్‌కప్‌లో మహిళల జట్టు 0-5తో థారులాండ్‌ చేతిలో ఓడాయి. గురువారం జరిగిన తొలి సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 12-21, 16-21 తేడాతో షీ యు-కీ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం పురుషుల డబుల్స్‌లో సాత్త్విక్‌-చిరాగ్‌ జోడీ 21-14, 21-14తేడాతో హి-జి-టింగ్‌, జో హో డోంగ్‌ను చిత్తు చేయడంలో స్కోర్‌ 1-1తో సమమైంది. ఆ తర్వాత జరిగిన రెండో సింగిల్స్‌లో సమీర్‌ వర్మ 21-14, 9-21, 22-24తేడాతో లీ-జంగ్‌-జూ చేతిలో ఓడాడు. ఆ తర్వాత పురుషుల డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌-ధృవ్‌ కపిల 24-26, 19-21తో లీ-చెంగ్‌, వాంగ్‌-హి-యూ చేతిలో, ఆఖరి సింగిల్స్‌లో కిరణ్‌ జార్జి 15-21, 17-21తో లీ-షి-ఫెంగ్‌ చేతిలో ఓటమిపాలైంది. క్వార్టర్‌్‌సలో భారతజట్టు ఆతిథ్య డెన్మార్క్‌తో శుక్రవారం తలపడనుంది.
మహిళలకూ నిరాశే..
ఉబర్‌కప్‌ గ్రూప్‌ాబిలో భారత మహిళల జట్టు 0ా5 తేడాతో థారులాండ్‌ చేతిలో ఓటమిపాలైంది. బుధవారం రాత్రి జరిగిన తొలి సింగిల్స్‌లో మాల్విక 15ా21, 11ా21తో ఛోాచువాంగ్‌ చేతిలో, డబుల్స్‌లో పొన్నప్పాసిక్కిరెడ్డి 16ా21, 12ా21తో జోాఖుల్పింగ్‌, ప్రజోగ్నిలో చేతిలో, రెండో సింగిల్స్‌లో అదితి భట్‌ 16ా21, 21ా18, 15ా21తో బూసనాన్‌ చేతిలో ఓడింది. దీంతో థారులాండ్‌ 3ా0 ఆధిక్యతలో దూసుకెళ్లింది. ఆ తర్వాత మరో డబుల్స్‌లో త్రీషాాగాయత్రి గోపీచంద్‌ 17ా21, 16ా21తో, ఆఖరి సింగిల్స్‌లో తస్మిన్‌ మీర్‌ 19ా21, 15ా21తో పరాజయం పాలైంది. ఉబర్‌ కప్‌ క్వార్టర్స్‌లో భారతజట్టు జపాన్‌తో తలపడనుంది.