Oct 30,2020 14:49

న్యూఢిల్లీ: పబ్జీ వినియోగదార్లు ఇకపై ఆ గేమ్ ఆడలేరు. ఈ మేరకు పబ్జీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం
నుంచి  ఆ సంస్థ ప్రకటించింది.  సెప్టెంబరులో భారత ప్రభుత్వం నిషేధించిన  116 మొబైల్ యాప్ లలో పబ్జీ కూడా
వుంది. అయితే, సెప్టెంబరు 2 నుంచి పబ్జీ కొత్త డౌన్‌లోడ్లు నిలిచిపోయినా,  అప్పటికే  డౌన్‌లోడ్‌ చేసుకుని
వినియోగిస్తున్నవారు మాత్రం ఇప్పటివరకూ ఆ యాప్ ను వాడుతున్నారు. తాజాగా  పబ్జీ భారత సర్వర్లను అక్టోబరు
30 నుంచి నిలిపివేయడంతో ఇకపై ఈ యాప్‌ ఎవరికీ పనిచేయదు. దీంతో... నిషేధించిన రెండునెలల తర్వాత  పబ్జీ
తన సేవలను పూర్తిగా నిలిపివేసినట్లయింది.