
న్యూఢిల్లీ : యూనియున్ ఎఎంసి తమ నిర్వహణలోని ఆస్తుల (ఎఎంయు)ను రూ.10వేల కోట్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం బి30 నగరాల నుంచి వచ్చే ఆదాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ''2020వ సంవత్సరంలో ఆంధ్రాబ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్‌లు యునియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యాయి. ఈ విలీన సంస్ధకు ఇప్పుడు శాఖల పరంగా మరిన్ని వనరులు అందుబాటులో రావడం వల్ల వఅద్ధి వ్యూహం అమలు కావడంలో సహాయపడుతుంది'' అని యునియన్ ఎస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ సిఇఒ ప్రదీప్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంస్థకు ప్రభుత్వ రంగ బ్యాంక్ యునియన్ బ్యాంక్, జపనీస్ ఫారిన్ ఫైనాన్షియల్ సంస్థ దారు-చీ లైఫ్ హోల్డింగ్స్, ఐఎన్సిలు సహ స్పాన్సర్లుగా ఉన్నాయి.