Oct 28,2021 20:54

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరుకుమార్‌

మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరుకుమార్‌
భారాలు మోపుతున్న కేంద్రం
ప్రజాశక్తి-నెల్లూరురూరల్‌:పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, నిత్యావసరాలు రోజు రోజుకు కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అజరుకుమార్‌ అన్నారు. సిఐటియు నెల్లూరు రూరల్‌ మండల రెండో మహాసభ పొట్టే పాలెంలో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కౌలు రైతు సంఘం, సిఐటియు నాయకులు పొట్టే పాలెం చంద్రమౌళి, అజరు కుమార్‌లు మాట్లాడుతూ నేడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటు వారికి అమ్మాలని చూస్తుందన్నారు. కార్మికుల హక్కులను కాలరాయడం, పెట్రోలు, డీజిల్‌ గ్యాస్‌ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి భారాలు మోపుతుందన్నారు. నూతన సాగు చట్టాలను తీసుకువచ్చి రైతుల మెడకు ఉరితాళ్ళు బిగించడం వల్ల,సంపద కొంతమంది చేతిలోనే కేంద్రీకతమై దేశంలో అసమానతలు పెరుగుతున్నాయన్నారు. కార్మికులు సామాన్య మధ్యతరగతి ప్రజానీకం ఏకమై కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని తద్వారా మన హక్కులను కాపాడుకోగలమన్నారు. అసలే కరోనాతో జనం ఇబ్బంది పడుతుంటే ప్రతిరోజూ పెట్రోల్‌ డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచడంతో జనం అల్లాడుతున్నారన్నారు .
ఈ మహాసభలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు ఆలూరు తిరుపాలు, సిఐటియు నెల్లూరు రూరల్‌ నాయకులు అల్లాడి గోపాల్‌, మండల నాయకులు పూడిపర్తి జనార్ధన్‌, ఎస్‌కె అబ్దుల్లా పాల్గొన్నారు. మహాసభ అనంతరం 11 మందితో నూతన మండల కమిటీ ని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులు గా ఎస్‌.కె చాంద్‌ బాషా, డక్కా సురేష్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. మండల కమిటీ సభ్యులుగా కొత్త పెంచలయ్య, ఎస్‌.కె షబ్బీర్‌, ఎస్‌ కె బాబు, బి నాగరాజు, చిట్టేటి కిరణ్‌, ఎస్‌ అమర్నాథ్‌లు ఎన్నికైనారు.