
మరమనిషికి మనసును
బిగించే పండుగ ఇది!
మనసు గది తలుపులు తెర్చి
మరుగున పడ్డ మమతల
మధురానుభూతుల్ని కొత్త
బట్టల్లా కట్టి పిండివంటల్లా
తినిపించి బంధుమిత్రుల్ని
కళ్ల ముందు కళకళలాడించే
సత్సంప్రదాయాల సంగమం
భోగి సంక్రాంతి కనుమ..
ఒత్తిళ్ల బతుకు కెరటాన్ని
కాసేపు ఒడ్డున పడేసి
అలరించే సంబురం ఇది
మనసు కొమ్మ చివర కొత్త
సంతోషాల్ని పూతపూయించే
తెలుగు లోగిళ్ళ రంగుల
రంగవల్లి..
జీవన పోరాటంలో అలసి
మునగదీసుకొన్న బతుకు
చిత్రంలో మంచు పరదాలు
తీసుకొని వచ్చే తుషార
ఉషోదయాల నులి వెచ్చని
హేమంత కాంతిమత్వం!!
* భీమవరపు పురుషోత్తం, సెల్ : 9949800253