
ముగ్గురికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి - కె.వి పల్లి : నివర్ తుఫాన్ ప్రభావంతో కె.వి పల్లి మండలం సొరకాయల పేట కట్ట వద్ద నీటి ప్రవాహం వల్ల కట్ట తెగి పోవడంతో వాహనాలను కట్టమీద వెళ్లకుండా మినిమిరెడ్డిగారి పల్లి మీదుగా పొంతలచెరువు క్రాస్‌కు దారి మళ్లించడం జరిగిందని ఎస్ రామ్మెహన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇందులో భాగంగా వాహనాలను కట్టమీద వెళ్లకుండా పోలీస్ కానిస్టేబుల్ ఆదినారాయణ, సుభాష్ లు వాహనాలను దారి మళ్లిస్తూ కట్ట వద్ద ఉన్న బస్సు షెల్టర్ వద్ద ఉండి విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం తెల్లవారు ఝామున నాలుగు నుంచి ఐదు గంటల ప్రాంతంలో పాలిస్ బండలు లోడుతో కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి పీలేరు వైపుకు వెళుతున్న లారీ బ్రేక్ ఫెయిల్ అయిన లారీ కట్ట సమీపంలో వున్న డివైడర్లను డీకొంటూ ఒక్కసారిగా పోలీసులు కూర్చున్న బస్సు షెల్టర్ పైకి దూసుకెల్లి కట్ట ప్రక్కలో ఒరిగి ఆగిపోయింది. దీంతో షెల్టర్ కుప్పకూలడంతో షెల్టర్‌లోని కానిస్టేబుల్స్‌తో పాటు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా పోలీసులకు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించినట్లు తెలిపారు. డ్రైవర్‌కు కాలు విరగగా పీలేరులో చికిత్స అందిస్తున్నట్లు ఎస్ఐ రామమోహన్ తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.