Nov 26,2020 07:59

బగోటా : బ్రెజిల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు, ట్రక్కును ఢకొీట్టడంతో 37 మంది మృత్యువాత పడ్డారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రెజిల్‌లో ఆర్థిక రాజధాని సావ్ పాలో  హైవేలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఓ టెక్స్‌టైల్‌ కంపెనీ చెందిన 53 మంది ఉద్యోగులు ప్రయాణిస్తున్న బస్సు, ట్రక్కును ఢ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్ధానిక ఆసుపత్రులకు తరలించారు. మృతులను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన జరగడానికి గల కారణాలు అధికారులు అన్వేషిస్తున్నారు.