Nov 22,2020 20:35

అలెగ్రే (బ్రెజిల్‌) : బ్రెజిల్‌లో ఓనల్ల జాతీయుణ్ణి శ్వేతజాతి సెక్యూరిటీ గార్డులు కొట్టి చంపడంపై దేశ వ్యాపితంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ హత్య జరిగిన పోర్టో అలెగ్రే నగరంలోని క్యారీఫోర్‌ సూపర్‌ మార్కెట్‌పై శుక్రవారం 1000 మందికిపైగా నిరసనకారులు దాడి చేశారు. నల్లజాతీయుడు తనపై దాడి చేస్తున్నాడని సూపర్‌ మార్కెట్‌ ఉద్యోగి ఒకరు సెక్యూరిటీ గార్డుకు చెప్పడంతో వారు అతన్ని చనిపోయే వరకూ కొట్టారు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటన మీడియా, సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారమయింది. పుటేజీల్లో నల్లజాతీయుడుపై సెక్యూరిటీ గార్డుల అమానవీయ దాడికి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. సూపర్‌ మార్కెట్‌పై దాడికి దిగిన నిరసనకారులు భవనం అద్డాలను, పార్కింగ్‌లో ఉన్న సూపర్‌ మార్కెట్‌ డెలివరీ వాహనాలను ధ్వంసం చేశారు. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. సౌ పౌలో, రియో డి జెనీరో నగరాల్లో ఉన్న కార్యీఫోర్‌ సూపర్‌ మార్కెట్‌ భవనాలపైనా నిరసన కారులు దాడికి దిగారు.