Nov 17,2020 21:25

బ్రసీలియా : బ్రెజిల్‌ మున్సిపల్‌ ఎన్నికల మొదటి రౌండ్‌లో అధ్యక్షుడు బోల్సనారో మితవాద పార్టీ తీవ్ర పరాజయం పాలైందని మాజీ అధ్యక్షుడు లూలా డసిల్వా సోమవారం వ్యాఖ్యానించారు. ట్విట్టర్‌లో ఎన్నికల రోజైన ఆదివారం ఈ పరాజయంపై తన నాలుగు పాయింట్ల అంచనాను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో భారీగా నష్టపోయేది బల్సనారోనేనని ఆయన పేర్కొన్నారు. వామపక్ష, మానవతావాద, సామాజిక న్యాయ విలువలు బలోపేతమవుతున్నాయంటే మరోసారి బ్రెజిల్‌ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని రుజువైందని లూలా పేర్కొన్నారు. బోల్సనారో బహిరంగంగా మద్దతు ప్రకటించిన 13 మంది మేయర్‌, కౌన్సిలర్ల అభ్యర్ధుల్లో కేవలం ఇద్దరు మాత్రమే ఎన్నిక కాగలిగారు. మరో ఇద్దరు రెండో స్థానంతో సరిపెట్టుకోగా, 9 స్థానాలు మాజీ సైనిక మిత్రపక్షాలకు దక్కాయి.