
కె.వి.పల్లి(చిత్తూరు): లారీకి బ్రేకులు ఫేలై పోలీసులు కూర్చున్నటువంటి బస్‌షెల్టర్‌ను, డివైడర్‌ను ఢ కొన్న సంఘటన కెవి.పల్లి మండలం సొరకాయల పేట వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. నివర్ ప్రభావంతో మండలంలోని సొరకాయల పేట కట్ట వద్ద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో వాహనాలు కట్టమీదకు వెళ్లకుండా పోలీసులు కాపలా కాస్తున్నారు. కానిస్టేబుల్ ఆదినారాయణ, సుభాష్‌లు కాపలా కాస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పాలిష్‌బండల లోడుతో కడప ఎర్రగుంట్ల నుంచి వస్తున్నటువంటి లారీ అదుపు తప్పి పోలీసులు కూర్చున్న బస్షెల్టర్ని, పక్కనే ఉన్న డివైడర్‌ను ఢకొీట్టింది. దీంతో ఆదినారాయణ, సుభాష్‌లకు గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.