Mar 05,2021 19:08

హైదరాబాద్‌ : నందమూరి బాలకృష్ణ హీరోగా, ప్రముఖ దర్శకుడు బోయపాటి దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఫైట్‌ మాస్టర్స్‌గా పనిచేస్తున్న రామలక్ష్మణ్‌ ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఫైట్‌ మాస్టర్స్‌ చేస్తున్న యాక్షన్‌ సన్నివేశాలు రొటీన్‌గా ఉండడం.. వాటిలో క్రియేటివ్‌ లేకపోవడం వల్ల దర్శకుడు బోయపాటి శ్రీనుకి నచ్చలేదని సమాచారం. అసలు మొదట ఈ సినిమాకి యాక్షన్‌ మాస్టర్‌గా పలు భాషా చిత్రాల ఫైట్‌ మాస్టర్‌గా పేరుగాంచిన స్టన్‌ శివని బోయపాటి ఎంపిక చేసుకున్నారు. సృజత్మక విషయంలో బోయపాటికి, స్టన్‌శివకి కూడా అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో స్టన్‌ శివ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ స్థానంలోకి టాలీవుడ్‌ ప్రముఖ ఫైట్‌ మాస్టర్స్‌గా పేరుగాంచిన రామ్‌లక్ష్మణలను తీసుకున్నారు. వీరి పనితీరు కూడా బోయపాటికి నచ్చకపోవడంతో.. తిరిగి మరలా స్టన్‌ శివ యాక్షన్‌ మాస్టర్‌నే తీసుకువచ్చారు. దీంతో బోయపాటికి, రామలక్ష్మణ్స్‌కి మధ్య అభిప్రాయబేధాలు వచ్చి ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ముందు ఈ సినిమాలో బాలయ్యకు జోడీ నటించే నటి ఎవరు అన్నది ఖరారు చేయడానికే చిత్రయూనిట్‌ తర్జనభర్జనలు పడింది. తాజాగా.. ఫైట్‌ మాస్టర్‌ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఇటువంటి సమస్యలు వల్ల సినిమా ఇంకా ఆలస్యమవతుందని సినీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరాగా కనిపించనున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి షూటింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యాజైశ్వాల్‌ నటిస్తోంది. ఈ సినిమాకు టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. బహుశా సినిమా పేరు 'గాడ్‌ఫాదర్‌' అని పుకార్లు వినిపిస్తున్నాయి.