May 18,2021 22:09

నూతనంగా వేసిన బోరు

ప్రజాశక్తి - ఆళ్లగడ్డ రూరల్‌: పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం సమీపంలో నూతన బోరును వేసి నీటి సమస్యను పరిష్కరించారు. శాసన మండలి విప్‌ గంగుల ప్రభాకర్‌ రెడ్డి, శాసనసభ్యులు గంగుల బిజేంద్రారెడ్డి సహకారంతో చైర్మన్‌ డాక్టర్‌ రామలింగ రెడ్డి ఆధ్వర్యంలో 11వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం నూతనంగా బోరు ఏర్పాటు చేశారు. దీంతో బొరుగుల బట్టి వీధి, చిన్నపురెడ్డి వీధి, గీత, హుస్సేన్‌ రెడ్డి, ఖాన్‌ ఖా వీధులలో నీటి సమస్య తీరనుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్‌ నజీర్‌ ఉన్నారు.