Oct 27,2021 22:58

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: మండలంలోని బోడపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1, 2 తరగతులు చదువుతున్న విద్యార్థులకు తిప్పాయపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యసిబ్బంది పైలేరియా పరీక్షలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది సబ్‌ యూనిట్‌ అధికారి పి.ఏడుకొండలరావు మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.పుల్లయ్య, ఉపాధ్యాయులు ఎస్‌ కె.ఎం.హుస్సేన్‌ పీరా, హెల్త్‌ అసిస్టెంట్‌ జడ్డు.వెంకటేశ్వరరెడ్డి, ఏఎన్‌యంలు జి.ప్రమీల, విష్ణుప్రియ, ఆశావర్కర్‌ రంగమ్మ పాల్గొన్నారు.