Nov 30,2020 21:31

ఈ సందర్భంగా భారీ ఎత్తున గజమాలలతో సత్కరించారు. వీడ్కోలు పలుకుతున్న దృశ్యంప్రజాశక్తి - పలమనేరు : ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామీణ విద్యార్థులకు వెదురుతో చేసిన బొమ్మలతో విద్యార్థులకు విభిన్నంగా, వినూత్నంగా విలక్షణంగా విద్యాబోధన చేసే వై.గజేంద్రన్‌ సోమవారం పదవీ విరమణ చేశారు. గంగవరం మండలం కీలపట్ల హైస్కూలు నందు సోషియల్‌ స్టడీస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌గా పనిచేసిన ఆయన గతంలో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో మారుమూల కుగ్రామాలు, ఎమ్మార్పీగా కూడా పనిచేశారు. ఆయన సేవలను మాజీ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ హేమంత్‌ కుమార్‌ రెడ్డి, వైసిపి జిల్లా నాయకులు శశిధర్‌ నాయుడుతో పాటు సహచర ఉద్యోగులు గ్రామస్తులు పలువురు కొనియాడారు.