
మాట్లాడుతున్న సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-కందుకూరు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 5న జరిగే బంద్‌ను జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు జాలా అంజయ్య, సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య కోరారు. కందుకూరు సిపిఎం ప్రాంతీయ కమిటీ సమావేశం ఒ.రాయకోటయ్య అధ్యక్షతన మంగళవారం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలంన్నింటిని కార్పొరేట్లకు తాకట్టు పెడుతుందని చెప్పారు. ఈ విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరారు. సమావేశంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి ఎస్ఎ.గౌస్, నాయకులు డాక్టర్ మువ్వా కొండయ్య, డి.రామమూర్తి, ఎస్కె.మల్లిక, టి.వెంకట్రావు, ఎస్.పవన్‌కుమార్ పాల్గొన్నారు.