
వినతిపత్రం ఇస్తున్న సిఐటియు నాయకులు కృష్ణవేణి
ప్రజాశక్తి-రంపచోడవరం : ఏజెన్సీలో ఆశా, అంగన్వాడీ వర్కర్లకు బలవంతంగా వేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ను తక్షణమే ఆపాలని సిటిఐయు జిల్లా ఉపాధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఆశా వర్కర్లు చనిపోయే పరిస్థితి ఎదురవుతోందని , తక్షణమే బలవంతపు వ్యాక్సిన్ను ఏజెన్సీలో ఆపాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ కారణంగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుబాకకు చెందిన ఆశా వర్కర్ విజయలక్ష్మి మరణించినట్టు తెలిపారు. ఆమె కుటుంబానికి వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని రంపచోడవరం తహశీల్దారుకు వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు.