Apr 15,2021 01:03

బ్లాక్‌ గోల్డ్‌ యాజమాన్యానికి సమ్మె నోటీసు అందిస్తున్న కార్మికులు

గాజువాక : ఆటోనగర్‌ డి బ్లాక్‌లోని బ్లాక్‌ గోల్డ్‌ ప్రొఫైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. కంపెనీలో పనిచేస్తున్న 120 మంది కార్మికులకు సంబంధించి జరిగిన వేతన ఒప్పందం కాలపరిమితి ముగిసిందని కార్మికులు తెలిపారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని గత నెల 16వ తేదీన యాజమాన్యానికి డిమాండు నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. అయినా యాజమాన్యంలో స్పందన లేకపోవడంతో ఈ నెల 28 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు బుధవారం కార్మికులు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి రమణ మాట్లాడుతూ, కార్మికులు రోజుకు 12 గంటలు పనిచేస్తూ లాభాలు తెస్తున్నా యాజమాన్యం మొండిగా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సత్యారావు, ఈశ్వరరావు, మల్లేశ్వరరావు కార్మికులు పాల్గొన్నారు.