Dec 03,2021 21:40
  • ప్రతిపక్షాల ఆగ్రహం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సస్పెన్షన్‌ ఎత్తివేసి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ సస్పెండ్‌ అయిన 12 మంది ఎంపిలు గత ఐదు రోజులుగా పార్లమెంట్‌ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళన సాగిస్తున్న వీరికి మిగతా ప్రతిపక్ష ఎంపిలు సంఘీభావంంగా వచ్చి పాల్గొన్నారు. అదే సమయంలో బిజెపి ఎంపిలు అక్కడికి చేరుకొని కౌంటర్‌ ఆందోళన చేపట్టారు. సభలోని ఫోటోలను పట్టుకొని అక్కడికి చేరుకొని నినాదాలు ఇచ్చారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు కూడా ''కిసాన్‌ విరోధి మోడీ సర్కార్‌. వియు వాంట్‌ జస్టిస్‌'' అంటూ నినాదాలు చేపట్టారు. దీంతో అక్కడ కొద్ది సేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫోటోలు తీసుకున్న తరువాత బిజెపి ఎంపిలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. బిజెపి ఎంపీల కవ్వింపు చర్యపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ''బిజెపిని ఎవరు గైడ్‌ చేస్తున్నారు. తాము గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నప్పుడు 30-40 మంది బిజెపి ఎంపిలు వచ్చి కవ్వించేలా నినాదాలిచ్చారు. మర్యాద లేంకుడా, తాము కూర్చొన్న బ్లాంకెట్స్‌ను తొక్కుకుంటూ రచ్చ చేశారు. అరుపులు, కేకలతో రెచ్చగొట్టారు. దీని అర్థమేమిటి? ప్రజాస్వామ్యంలో బిజెపి ఇలానే పని చేయాలనుకుంటుందా? ఇదేనా మన దేశ సంస్కృతి? అని నిలదీశారు.
బిజెపి ఎంపీల రెచ్చగొట్టే చర్యపై లోక్‌సభలో దుమారం రేగింది.. : దర్యాప్తు సంస్థలను దుర్వినియోగ పరుస్తున్న కేంద్రం
లోక్‌సభలో శుక్రవారం సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సవరణ) బిల్లు, ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (సవరణ) బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)ని ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ఉపయోగించుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ''సిబిఐ ఇకపై దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థగా ఉండదు'' అని . ఈ బిల్లులను ప్రవేశపెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి.

ధాన్యం కొనుగోళ్లపై టిఆర్‌ఎస్‌ ఆందోళన : ఒప్పందం ప్రకారమే కొనుగోలు చేస్తామన్న కేంద్ర మంత్రి
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ వరుసగా ఐదో రోజు టిఆర్‌ఎస్‌ ఎంపిల ఆందోళన కొనసాగించారు. లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఫ్లకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ రైతులకు న్యాయం చేయాలంటూ నినాదాలతో హౌరెత్తించారు..
రాజ్యసభలో ఇదే అంశాన్ని టిఆర్‌ఎస్‌ సభ్యులు లేవనెత్తారు. టిఆర్‌ఎస్‌ ఎంపిలు కె.కేశవరావు, సురేష్‌ రెడ్డి పశ్నించారు. ప్రతి గింజనూ కొంటామని కేంద్ర మంత్రి రాష్ట్రంలో చెప్పారని, దాన్ని నిలబెట్టుకోవాలని అన్నారు. ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ సమాధానం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం (ఎంఓయు) ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని, ఆ మేరకు ధాన్యం సేకరణ జరుగుతోందని అన్నారు. 2018-19లో తెలంగాణలో 51.9 లక్షల టన్నులు, 2019-20లో 74.5 లక్షల టన్నులు, 2020-21లో 94.5 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు. బిజెడి ఎంపి సస్మిత్‌ పాత్ర పారాబాయిల్డ్‌ బియ్యం గురించి లేవనెత్తారు. దీనిపై కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ పారాబాయిల్డ్‌ బియ్యం వినియోగం తగ్గిందని, డిమాండ్‌ కూడా తగ్గిందని అన్నారు. జీరో అవర్‌లో బిజెడి సభ్యుడు ప్రసన్న ఆచార్య మాట్లాడుతూ పారా బాయిల్డ్‌ ధానం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఒరిస్సా, తెలంగాణ, తమిళనాడులో రైతులు ఈ పంట వేస్తారని, పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.