
న్యూఢిల్లీ : వివాదాస్పద వ్యాఖ్యలు పోస్ట్ చేయడంతో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై ఫేస్బుక్ యాజమాన్యం నిషేధం విధించింది. ద్వేషపూరిత, హింసను ప్రోత్సహించే వ్యాఖ్యలను పోస్ట్ చేయకూడదనే మా నిబంధనలను ఉల్లంఘించడంతో ఆయనపై నిషేధం విధించినట్లు ఫెస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాజాసింగ్‌ను ''ప్రమాదకరమైన వ్యక్తులు, సంస్థల'' జాబితాలో చేర్చామని, దీంతో ఆయన ఫొటో, వీడియో షేరింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అనుమతించబడరని అన్నారు. అతనికి ప్రాతినిథ్యం వహించే పేజీలు, గ్రూపులు, ఇతర ఖాతాలను కూడా కంపెనీ తొలగిస్తుందని చెప్పారు.