Nov 22,2020 20:44

హైదరాబాద్‌: బండి సంజరు తనను మోసం చేశాడని ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. తన నియోజకవర్గం వరకు తాను ఎంపిక చేసిన వారికే సీట్లు ఇవ్వాలని కోరానని, కానీ అలా జరగలేదని తెలిపారు. తన గెలుపుకు కారణమైన వారికి సీట్లు ఇప్పించులేకపోయానని పేర్కొన్నారు. ఈమేరకు ఆదివారం విడుదలైన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆడియో కలకలం రేపుతంది. ఇక్కడ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, తన చుట్టాల్లో ఒకరు చనిపోతే అక్కడ ఉన్నానని, 2,3 రోజుల్లో అన్ని విషయాలపై కేంద్రానికి లేఖ రాస్తానని ఆడియోలో తెలిపారు.