Jan 15,2022 12:46

బీహార్‌ : కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన నలందా జిల్లాలో చోటుచేసుకుంది. విషపూరిత రసాయనం తాగి వారంతా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాట్లాడుతూ... కల్తీ మద్యం తాగి మన్పూర్‌లో ముగ్గురు, చోటీపహారీలో ఇద్దరు చనిపోయినట్లు తెలిపారు. దీనిపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు.