Jan 13,2022 20:36

హైదరాబాద్‌ : ప్రముఖ మొబైల్స్‌ రిటైల్‌ విక్రయ సంస్థ బిగ్‌ సి వినియోగదారులను ఆకర్షించడానికి సంక్రాంత్రికి వినూత్న ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సందర్బంగా మొబైల్స్‌, స్మార్ట్‌ టివిలు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లపై ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తున్నామని బిగ్‌ సి వ్యవస్థాపకులు, సిఎండి యం బాలు చౌదరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మొబైల్స్‌ కొనుగోళ్లపై 10 శాతం వరకు క్యాష్‌ బ్యాక్‌, డౌన్‌పేమెంట్‌ లేకుండా సులభ వాయిదాల పద్దతిలో కొనుగోళ్లకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రతీ మొబైల్‌పై కచ్చితమైన బహుమతి, స్మార్ట్‌ టివిల కొనుగోలుపై రూ.4,000 వరకు క్యాష్‌ బ్యాక్‌ అందిస్తున్నామన్నారు. అమెజాన్‌ పే, డెబిట్‌కార్డు, పేటియం మాల్‌ ద్వారా చేసే కొనుగోళ్లపై పలు ఆఫర్లు అందుబాటులో ఉంటాయన్నారు. మొబైల్‌ విలువను బట్టి రూ.8,000 క్యాష్‌ బ్యాక్‌ ఉంటుందన్నారు.