
బెదిరింపులకు తలొంచొద్దు : కొనకళ్ల
కలెక్టరేట్ : అధికార పార్టీ బెదిరింపులకు తలొగ్గకుండా ప్రజలు మంచి వ్యక్తులను ఎన్నుకోవాలని టిడిపి మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షులు, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణరావు కోరారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏ వ్యక్తి కావాలో ఎన్నుకుని గ్రామానికి నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ ప్రజా స్వామ్యంలో ఉందని గుర్తుచేశారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన పంచాయతీలకు నిధులు కేంద్రప్రభుత్వం నుండి నరేగా ద్వారా నేరుగా వస్తాయన్నారు. అధికార వైసీపీ మాటలు నమ్మాల్సిన పనిలేదన్నారు. మాజీ కౌన్సిలర్లు బత్తిన దాసు, బచ్చుల అనిల్‌కుమార్, టిడిపి కార్యదర్శి పి.వి. ఫణి కుమార్ పాల్గొన్నారు.