Apr 11,2021 14:50

కర్నూలు క్రైం : బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని పోలీసు సిబ్బంది అన్నారు. ఆదివారం పూలే 195వ జయంతి సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి నివాళులర్పించారు. ఆర్‌ఐలు, వి.యస్‌. రమణ, బి. సుధాకర్‌, ఎ. సురేంద్రా రెడ్డి, ఆర్‌ ఎస్సైలు విజరు, అల్లాఉద్దీన్‌, అహ్మద్‌ హుస్సేన్‌, వీరన్న, ఎఆర్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు పాల్గొన్నారు.