
న్యూఢిల్లీ : చారిత్రాత్మక ట్రాక్టర్ పరేడ్‌కు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ముందుకు సాగారు. సుమారు ఐదువేలకు పైగా ఆందోళనకారులు సింఘు సరిహద్దుల్లో బారికేడ్లను పగులగొట్టారు. అయితే రైతులు సంయమనం పాటించాలని రైతు నేతలు ప్రకటించారు. పోలీసులతో చర్చించిన అనంతరం ర్యాలీ చేపట్టే సమయాన్ని ప్రకటిస్తామని అన్నారు. కాగా, హర్యానా ఢిల్లీ మధ్యలో ఉన్న ఈ సింఘు సరిహద్దులోనే రైతులు ఆందోళనను ప్రారంభించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రెండు నెలలుగా అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నారు. ఈ నిరసనలో భాగంగానే నేడు ఢిల్లీలో రిపబ్లిక్ డే పరేడ్‌ను సవాలు చేస్తూ.. ట్రాక్టర్ ర్యాలీ చేపట్టనున్నట్లు ప్రకటించారు.