Feb 25,2021 22:00

ఫొటో : మాట్లాడుతున్న మాలకొండారెడ్డి

ఫొటో : మాట్లాడుతున్న మాలకొండారెడ్డి
బాలల హక్కులను పరిరక్షించాలి
ప్రజాశక్తి - కావలి : సమాజంలో బాలల హక్కులను రక్షించి, వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్‌గా తీర్చిదిద్దాలని సామాజిక కార్యకర్త ఎం.మాలకొండారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తుమ్మలపెంటరోడ్డు మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో సచివాలయం 8,9 మహిళా సంరక్షణ కార్యదర్శుల ఆధ్వర్యంలో గురువారం బాలల హక్కులపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిబయట తిరుగుతున్న పిల్లలను బాలకార్మికులుగా పిలుస్తారని తెలుపుతూ.. బాలకార్మికుల నిషేధచట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. 10వ మహిళా సంరక్షణ కార్యదర్శి కె.బిందు మాట్లాడుతూ విద్యాహక్కు, స్వేఛ్చాహక్కు, సమానత్వం, రక్షణహక్కులపై అవగాహన కల్పించారు. 8వ
మహిళా సంరక్షణ కార్యదర్శి ఎన్‌.కోటేశ్వరి మాట్లాడుతూ బాలబాలికలు అక్రమరవాణా, రక్షణ కోసం హెల్ప్‌లైన్‌ 1098ని వినియోగించుకుని రక్షణ పొందాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.శాంతకుమారి, ఉపాధ్యాయులు కె.దొరసానమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.