Oct 28,2021 16:15

ప్రజాశక్తి- పెనుమంట్ర
బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన పెనుమంట్ర మండలంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెనుమంట్ర మండలం మార్టేరు బాలికల వసతి గృహంలో ఇరగవరం మండలం పొదలాడ గ్రామానికి చెందిన గెడ్డం స్రవంతి (12) రూమ్‌ లో ఉరివేసుకొని మృతి చెందింది. బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మఅతి క్రింద కేసు నమోదు చేసి ,దర్యాప్తు చేస్తున్నారు.