Nov 22,2020 19:14

ముంబై: బాలీవుడ్‌ నటి లీనా ఆచార్య(30) ఆదివారం కన్నుమూశారు. ఈమె పలు సీరియళ్లు, సినిమాల్లో నటించారు. రెండేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె ముంబైలో చికిత్స పొందుతున్నారు. రాణీముఖర్జీ నటించిన హిచ్కీ చిత్రంలో లీనా ఆచార్యకు మంచి పేరు వచ్చింది. ఈమె చివరిసారిగా క్లాస్‌ ఆఫ్‌ 2020 అనే వెబ్‌సిరీస్‌లో నటించారు.