Mar 02,2021 21:15

ప్రజాశక్తి - పెనుమంట్ర
           నేపాల్‌లోని ఇండోనేపాల్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్విటేషన్‌ బాక్సింగ్‌ పోటీల్లో మండలంలోని నత్తా రామేశ్వరం పంపనవారిపాలేనికి చెందిన కండిబోయిన మాధవి గోల్డ్‌ మెడల్‌ సాధించింది. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక ఎన్‌ఐఎస్‌ బాక్సింగ్‌ కోచింగ్‌ కె.చిరంజీవి మాట్లాడుతూ ఫిబ్రవరి 24 నుండి 28వ తేదీ వరకూ ఇండో నేపాల్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్విటేషన్‌ బాక్సింగ్‌ పోటీలు జరిగాయన్నారు. ఈ పోటీల్లో వివిధ దేశాల నుండి 200 మందికి పైగా బాక్సర్లు ఈ పోటీలో పాల్గొన్నారని తెలిపారు. యూత్‌ మహిళా విభాగం 51 - 54 కేజీల కేటగిరిలో మాధవి గోల్డ్‌ మెడల్‌ సాధించిందన్నారు. వీరితో పాటు మరో ఏడుగురు క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని మెడల్స్‌ సాధించారు. వీరందరూ పెనుమంట్రలోని జెటికె బ్లూ కార్నర్‌ బాక్సింగ్‌ క్లబ్‌లో శిక్షణ పొందాని చెప్పారు. కోచ్‌ కె.చిరంజీవిని, విద్యార్థి మాధవిని అభినందించారు.