ప్రజాశక్తి - డోన్: భారతీయ సంస్కృతిలో అంతర్భాగమైన ఆయుర్వేదంతో చక్కటి ఆరోగ్యం పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ కెఎల్ఎన్.రెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదుట ఐఎంసి ఆయుర్వేద హెర్బల్ స్టోర్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో పూర్వం నుంచి ఆయుర్వేదానికి మంచి పేరుందని తెలిపారు. మారుతున్న జీవన విధానాలతో పాటు రసాయనిక ఎరువులు, పురుగు మందుల అవశేషాలతో కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రీయ ఉత్పత్తులతో పండించిన ఆహారం తీసుకోవాలని సూచించారు. గతంలో మనం వాడే ఆయుర్వేద పద్ధతులను కూడా వాడితే మంచి ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చన్నారు. మాజీ జడ్పిటిసి వలసల రామకృష్ణ, ఐఎంసి ప్రతినిధులు శ్రీనివాసరావు, మహబూబ్ బాష, పట్టణ ప్రముఖులు శేఖర్ నాయుడు, ఆర్మీ రామయ్య, ఆర్ట్ రమణ, ప్రకాష్ పాల్గొన్నారు.
ఆయుర్వేద కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మున్సిపల్ కమిషనర్ కెఎల్ఎన్.రెడ్డి