Mar 02,2021 23:20

ప్రచారం నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు

- సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌:
 'అవ్వా... నీ ఓటు సిపిఎం గుర్తు అయిన సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తుకే వేయాలంటూ సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గసభ్యులు పి.ఈరన్న, సిఐటియు నాయకులు బి.వీరారెడ్డి కోరారు. మంగళవారం వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదోని మున్సిపాటికీ జరుగుతున్న ఎన్నికల్లో సిపిఎంగా 17వ వార్డు అంబేద్కర్‌ నగర్‌, సిపిఎం అభ్యర్థిగా అంజనాదేవి పోటీ చేస్తున్నారని, ఆమెను గెలిపించాలని కోరారు. 2013లో ఒకసారి గెలిపించి వార్డు అభివృద్ధికి పట్టం కట్టారని తెలిపారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పారు. సిపిఎం అభ్యర్థిని గెలిపిస్తే వార్డు అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వెంకటేష్‌, నవీన్‌, వినోద్‌ పాల్గొన్నారు.