Oct 27,2021 21:57

ఫొటో : అవగాహన కల్పిస్తున్న దృశ్యం

ఫొటో : అవగాహన కల్పిస్తున్న దృశ్యం
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ప్రజాశక్తి-వింజమూరు : దూర విద్యా విధానం ద్వారా 14 సంవత్సరాలు నిండిన వారు బడి మధ్యలో మానేసిన వారు పదవ తరగతి ఫెయిల్‌ అయిన వారు తిరిగి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దూరవిద్య జిల్లా కోఆర్డినేటర్‌ ఎల్‌ పి రమణ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా వింజమూరులో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ దూర విద్య ద్వారా ఓపెన్‌ స్కూల్‌ పదవ తరగతి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకునేందుకు ఏదొక సదవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని 14 సంవత్సరములు నిండిన అందరూ అర్హులే అని అన్నారు. బడి మధ్యలో మానేసిన వారు పదవ తరగతి ఫెయిల్‌ అయిన వారు అర్హులన్నారు. అలాగే కే2 సంవత్సరములు నిండిన వారు పదవ తరగతి పాస్‌ అయి ఉండి ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకోవచ్చు అన్నారు. మహిళలకు వత్తి వ్యాపార రంగాలలో ఉన్నవారికి ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు వివిధ సంఘ సభ్యులకు సామాజికంగా వెనుకబడిన వారికి ఇదొక అవకాశం అన్నారు. సెలవు దినాల్లో మాత్రమే తరగతులు నిర్వహించబడతాయన్నారు.
ఇంటర్నెట్‌ ఏపీ ఆన్లైన్‌ ద్వారా ప్రవేశం నమోదు చేసుకునే అవకాశం కలదు అన్నారు. అడ్మిషన్స్‌ పొందాలనుకునేవారు నవంబర్‌ 10 లోపల ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐ కోఆర్డినేటర్‌ సంకే ఐజాక్‌ గుండా శ్రీనివాసరావు ఆవుల వెంకటేశ్వర్లు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.