ప్రజాశక్తి - కోసిగి రూరల్: అవినీతి పార్టీగా వైసిపి చరిత్రలో నిలిచిపోతుందని టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. సోమవారం కోసిగిలో మాజీ సర్పంచి ముత్తిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిడిపి నాయకులకు మతిభ్రమించిందంటూ వ్యాఖ్యలు చేసిన వై.ప్రదీప్ రెడ్డిపై మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వం శ్రీమఠం భూములు అమ్మకానికి పేపర్ ప్రకటనలు ఇచ్చి గత టిడిపి ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. వైసిపి నాయకులు పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, ఏ పని చేసినా పర్సంటేజీలు పంచుకుంటున్నారని విమర్శించారు. కోసిగి మాజీ సర్పంచి ముత్తిరెడ్డి, టిడిపి నాయకులు చింతలాగేని నర్సారెడ్డి, పల్లెపాడు వెంకట రెడ్డి, తాయన్న, దుబ్బిరెడ్డి, నడిగేని రంగన్న, కప్పయ్య, భీమయ్య, లక్ష్మీకాంత్, గోపాల్ ఉన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి