Oct 12,2020 18:31
ఆవిడా.. ఇంట్లోనే ..!

ఎవరైనా సరే .. మీ శ్రీమతి ఏం చేస్తారు అని అడిగితే- ఆవిడకు బయట చేసే ఉద్యోగం ఏమీ లేకుంటే- ఃఃఆ .. ఆవిడా .. ఖాళీనే. ఇంట్లోనే ఉంటుంది..ఃః అంటారు కొంతమంది మగ మహాశయులు. అలాంటి ప్రశ్నే పిల్లలను అడిగినా ఃఃమా అమ్మా .. ఖాళీనే. ఇంట్లోనే ఉంటుంది.ఃః అనేస్తారు యథాలాపంగా.


బయటకు వెళ్లి చేసేదే పని.. ఇంట్లో చేసేది పని కాదని చాలామందిలో జీర్ణించుకుపోయిన అభిప్రాయం. చేసిన పనికి ప్రతిఫలంగా చేతికి నాలుగు జీతం రాళ్లు అందితేనే అది విలువైన పని అని వారి నిర్ధారణ. కానీ, అది నిజం కాదు. జీతభత్యాలు లేకున్నా ఇంటా బయటా మహిళలు చేసే పని ఏమాత్రం తక్కువ కాదు. మరీ చెప్పాల్సి వస్తే- బయట మగ ఉద్యోగులు చేసే జీతపు పని కన్నా- ఇంట్లో ఇల్లాళ్లు చేసే పని చాలా ఎక్కువ కూడా! ఎంత ఎక్కువ అంటే - అది లెక్కకు అందనంతబీ ప్రతి పనికి వేతనం లెక్కేస్తే- గృహపతులు అనుకునేవాళ్లు చెల్లించలేనంత!


ఇలాంటి పరిస్థితినే తమ ఇంట్లో గమనించాడు అనుజాత్‌. వాళ్లది కేరళలోని త్రిసూర్‌. తను ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అనుజాత్‌ వాళ్ల నాన్నను ఎవరన్నా బయటివాళ్లు ఃఃమీ ఆవిడ ఏం చేస్తుందీఃః అనడిగితే- ఃఃఆ .. ఏమీ లేదు.. ఇంట్లోనే.. ఖాళీగానే..ఃః అనేవాడు. అనుజాత్‌కు అది కరెక్టు కాదనిపించేది. ఎందుకంటే- వాళ్లమ్మ ఎప్పుడూ ఇంట్లో ఖాళీగా ఉండదు. బోలెడు పనులు చేస్తోంది. అమ్మే కాదుబీ చుట్టుపక్కల అమ్మలందరూ అంతే! నిరంతరంగా ఇంటి కోసం, ఇంటిల్లిపాది కోసం ఏదొక పని చేస్తూనే ఉంటారు. అదే విషయాన్ని ఓ బొమ్మగా గీశాడు అనుజాత్‌. ఇదిగో.. ఃఃమా అమ్మా, మా ఇరుగు పొరుగు అమ్మలూ..ఃః అని దానికి పేరు కూడా పెట్టాడు. మర్నాడు ఆ బొమ్మను స్కూల్లో టీచరు చూశారు. అనుజాత్‌ విశాల పరిశీలనకు చాలా ఆశ్చర్యపోయారు. మనసారా అభినందించారు. అంతేకాదుబీ ఆ బొమ్మను పై అధికారులకు పంపారు. అధికారులు దానిని ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి దృష్టికి తెచ్చారు. ఆయన ఆ బొమ్మ ఉద్దేశాన్ని గమనించారు. మహిళలు తమ శ్రమ చేత తమ ఇళ్లనే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనూ నడిపిస్తారు అని చెప్పటం కోసం .. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ పుస్తకానికి కవర్‌ పేజీగా ఆ బొమ్మనే ముద్రించారు. ఇప్పుడు అనుజాత్‌ వాళ్ల నాన్నను ఎవరన్నా ఃఃమీ ఆవిడ ఏం చేస్తారుఃః అనడిగితే- మునుపటిలా సమాధానం చెప్పటం లేదు! అవునట్టు అనుజాత్‌ ఈ బొమ్మకు అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు.