Jan 08,2021 18:43

లక్నో : డాల్ఫిన్‌ని ఓ గ్యాంగ్‌ అత్యంత క్రూరంగా.. కర్రలతోనూ, రాడ్లతోనూ కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అత్యంత పాశవికంగా.. డాల్ఫిన్‌ను గొడ్డలితోనూ... ఇనుప రాడ్‌తోనూ కొడుతుండగా.. అసలు కారణం లేకుండా ఎందుకు అలా కొడుతున్నారని అంటున్నాగానీ.. ఆ గ్యాంగ్‌ అవేవీ పట్టించుకోకుండా.. రక్తం వచ్చేలా.. చివరకు అది చనిపోయేవరకు కొట్టారు. ఇలా చనిపోయిన డాల్ఫిన్‌ కాలువ ఒడ్డున పడి ఉండడంతో.. చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గుమిగూడారు. ఈ మేరకు సమాచారం అందిన అటవీశాఖా అధికారి అక్కడి చేరుకుని.. ప్రజలని ఎందుకు చనిపోయింది అని వివరాలు అడిగినా.. చెప్పడానికి ఎవరు ముందుకు రాలేదని... డాల్ఫిన్‌ శరీరాన్ని పరిశీలించగా.. గొడ్డలిదెబ్బలతోనూ.. గాయాలతోనూ ఉండడం గమనించినట్లు ఆయన ఎఫ్‌ఆర్‌లో నమోదు చేశారు. డాల్ఫిన్‌ను కొట్టి చంపిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అవ్వగా.. దాన్ని గమనించిన పోలీసులు సమీప గ్రామానికి చెందిన నిందితుల్ని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అలాగే ఈ ఘటన డిసెంబర్‌ 31న జరిగిందని.. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు జైలులో ఉన్నారని.. పోలీసు అధికారి ప్రతాప్‌ఘర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.