
సాలూరు : రాబోయే సీజన్‌కి సంబంధించిన అటవీ ఉత్పత్తుల కొనుగోలుపై జిసిసి ఉద్యోగులు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని జిసిసి డిఎం డి.రామ్మూర్తి కోరారు. సోమవారం స్థానిక జిసిసి బ్రాంచి కార్యాలయంలో సేల్స్మేన్లు, డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాది జనవరి నుంచి అటవీ ఉత్పత్తుల కొనుగోలు ప్రారంభం కానుందని చెప్పారు. నాణ్యమైన ఉత్పత్తుల కొనుగోలుపై దృష్టి సారించాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గిరిజనుల వద్దకే సిబ్బంది వెళ్లి కొనుగోలు చేయాలన్నారు. అటవీ ఉత్పత్తుల ధరలను జిసిసి ప్రకటించిందని, వాటి గురించి గిరిజనులకు తెలియజేయాలని చెప్పారు. పిక్కతో ఉన్న చింతపండు ధర కిలో రూ.36, పిక్క తీసిన చింతపండు ధర రూ.63 అని చెప్పారు. సమావేశంలో బ్రాంచ్ మేనేజర్ జె.రామారావు, అకౌంటెంట్ సూర్యనారాయణ పాల్గొన్నారు.