Mar 02,2021 22:45

విచారణ చేస్తున్న డిఎస్‌పి

ప్రజాశక్తి-శింగరాయకొండ: ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసును డిఎస్‌పి సురేష్‌బాబు మంగళవారం విచారణ మొదలుపెట్టారు. జనవరి 17న సోమరాజుపల్లి పంచాయతీలోని తిరుమల పట్టాభినగర్‌కు చెందిన వై.శ్రీనుకుమార్‌, వై.రాజశేఖర్‌ అనే ఇద్దరిని శ్రీనివాసు, రవి అనే ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఒంగోలు రిమ్స్‌ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఆ కేసును డిఎస్‌పి సురేష్‌బాబు ఆర్‌టిసి బస్టాండ్‌ వద్ద ఉన్న ఘటనా స్థలానికి వచ్చి చుట్టుపక్కల వారిని విచారించారు. డిఎస్‌పి వెంట హెడ్‌కానిస్టేబుల్‌ ఎస్‌.భాస్కర్‌లింగం ఉన్నారు.