Nov 21,2020 23:17

మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి-అంబాజీపేట : చిరతపూడి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆత్మహత్యాయత్నానికి ప్రేరేపించిన వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు నాయకులు డిమాండ్‌ చేశారు. చిరతపూడిలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు కూలీలతో మాట్లాడారు. గ్రామంలో యథార్థ విషయాలను అడిగి తెలసుకున్నారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌ విప్పర్తి చంద్రశేఖర్‌ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు మాట్లాడారు. రెండు రోజుల క్రితం ఉపాధి హామీ ఎపిడి గ్రామంలో విచారణ చేపట్టారని, కానీ గ్రామంలో కొందరు కావాలని ఆ విచారణ పూర్తి కాకుండా పీడీ రావాలని పట్టుబట్టారని, ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై కావాలనే ఇదంతా చేస్తున్నారని అనుమానాలు వ్యక్తమవు తున్నాయని చెప్పారు. గ్రామంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యద ర్శులు జి.వెంకటేశ్వరరావు, బి.ఎస్తేరు రాణి, బీమాల శ్రీను పాల్గొన్నారు.