May 04,2021 13:33

అమరావతి : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో... ఆటోలు, సిటీ బస్సులూ 12 గంటల వరకే తిరగాలి.. ఆ తర్వాత తిరిగితే సీజ్‌ చేయాలని ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. నిర్ణీత సమయాల ప్రకారం.. రాకపోకలను నియంత్రించడం ద్వారా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఎల్లుండి నుంచి పాక్షిక కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలనిచ్చింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే ప్రజా రవాణాను అనుమతించాలని ప్రకటించింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చే ఆటోలను సీజ్‌ చేయాలని తీర్మానించింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచేందుకు అనుమతిస్తామని వెల్లడించింది. సిటీ బస్సుల రాకపోకలను కూడా నియంత్రించేందుకు వీలుగా ప్రభుత్వం నుండి అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.