Oct 28,2021 19:19

sahayam chestunna rajababu, nagaraju

అట్లూరి చారిటబుల్‌ ట్రస్ట్‌ సాయం
ప్రజాశక్తి-ఆగిరిపల్లి
అగ్ని ప్రమాద బాధితులకు అట్లూరి చారిట్రబుల్‌ ట్రస్టు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తోందని ఆ ట్రస్టు ప్రతినిధులు కె.పి.రాజబాబు, పి.వి.నాగరాజులు అన్నారు. ఆగిరిపల్లి మండల పరిధిలోని మల్లిబోయినపల్లి గ్రామంలో ముల్లంగి కిరణ్‌కు చెందిన పూరిల్లు విద్యుత్‌షార్ట్‌ సర్కూట్‌తో పూర్తిగా అగ్నికి ఆహూతైన విషయం తెలుసుకొన్న అట్లూరి చారిట్రబుల్‌ ట్రస్టు అధినేత అట్లూరి రమేష్‌ తన ప్రతినిధులను పంపించి బాధిత కుటుంబానికి రూ.8000 ఖరీదు చేసే బియ్యం, వంటసామాగ్రి, నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.భాస్కర శర్మ,కె.కాంతారావు,యం.ప్రతాప్‌,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.